Friday, November 22, 2024

ఆక‌ట్టుకుంటుంన్న వేదురు ఆకుల టీ.. ఆరోగ్యానికి మంచిది అంటున్న డాక్ట‌ర్లు..

మ‌నకందరికీ తేయాకుతో చేసే టీ మాత్రమే తెలుసు. కాకపోతే ఈ మధ్య కాలంలో అల్లం టీ, పసుపు టీ, చామంతి టీ, పుదీనా టీ, లవంగం టీ, మసాలా టీ తులసి టీ లాంటివి కూడా వస్తున్నాయి. అయితే అన్నింటికన్నా భిన్నంగా జపాన్‌ వారు వెదురు ఆకులతో చేసే టీ , ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందింది. డార్జిలింగ్‌ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ టీని తయారుచేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే చెట్టు వెదురు చెట్టు. రోజుకూ 50 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఈ చెట్టు నాలుగేళ్లపాటూ పెరిగితే… దీని నుంచి అద్భుతమైన వెదురు కలప వస్తుంది. దాంతో ఫర్నిచర్‌, బాస్కెట్లు, మ్యాట్స్‌, బీర్‌, వస్త్రాలు సహా చాలా తయారు చేస్తారు.

చైనా సంప్రదాయ మందుల్లో వెదురును వాడే వారు. వెదురు ఆకులను మరగబెట్టి… టీ తయారుచేసేవారు. ఈ ఆకులు ముది రినవి కాకుండా… లేత ఆకుల్ని వాడుతారు. వెదురు ఆకుల టీ… థాయిలాండ్‌, కొరియా, తైవాన్‌, జపాన్‌, ఈశాన్య ఇండియాలో పేరు తెచ్చుకుంది. ఈ టీ తేలిగ్గా ఉంటంది. తియ్యగా ఉంటూనే గడ్డి వాసన వస్తుంది. మొత్తంగా గ్రీన్‌ టీ లాగా ఉంటుంది. ఇందులో కెఫైన్‌ అన్నదే ఉండదు కాబట్టి… ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వెదురు ఆకుల నుంచి సిలికా అనే ఖనిజం లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఎముకల్ని బలంగా చేస్తుంది. జుట్టు బాగా పెరగాలన్నా, చర్మం కోమలంగా మారాలన్నా… కాలి, చేతి వేళ్ల గోళ్లు ఆరోగ్యంగా, బలంగా అవ్వాలన్నా… వెదురు ఆకుల టీ తాగాలి.

ఇప్పుడు జుట్టు బాగా పెరగడానికి కాస్మోటిక్‌ కంపెనీలు వెదురు ఆకుల్ని వాడి… షాంపూలు తయారుచేస్తున్నాయి. మన దేశంలో సరైన ఆహారం లేక ప్రజల ఎముకలు బలంగా ఉండట్లేదు. ముసలివాళ్లు కాకముందే… ఎముకల్లో పటుత్వం తగ్గిపోతోంది. అందువల్ల వెదురు ఆకుల టీ తాగితే… ఎముకలు గట్టిగా అవుతాయి. నోట్లో దంతాలు కూడా బలంగా అవుతాయి. ముసలితనంలో ఎముకలతో వచ్చే అనారోగ్యాలు దూరమవుతాయి. ఈ టీలో యాంటీఆక్సిడెంట్స్‌ ఫుల్లుగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అడ్డమైన రోగాలు రానివ్వవు. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఆపగలవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement