వైఎస్సార్ కాపు నేస్తం పథకం వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గొల్లప్రోలు లో నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ.45 వేలు ఇచ్చామన్నారు. ఇప్పటివరకూ వైఎస్సార్ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించామన్నారు. నవరత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. నాన్ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో 16 వేల కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్ల లబ్ధి పొందారన్నారు. కాపు నేస్తం కింద అర్హులైన 3,38,792 మందికి రూ.508.18 కోట్ల లబ్ధి జరుగుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement