మహారాష్ట్రలోని పుణేలో ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే దురుసుగా ప్రవర్తించాడు. పోలీసు సిబ్బందిలోని ఓ అధికారిపై ఆయన చేయిచేసుకున్నారు. సహనం కోల్పోయిన చెంపదెబ్బ కొట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్యక్రమం ముగిసిన తర్వాత సునీల్ కాంబ్లే వేదిక నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. వేదిక దిగుతున్న క్రమంలో నిలబడి ఉన్న పోలీసు సిబ్బందిపై కోపంతో ఉద్దేశపూర్వకంగా చెంపదెబ్బ కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన జరిగిన సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వేదికపైనే ఉన్నారు.