Saturday, November 23, 2024

పుట్టిన వెంటనే ఆధార్‌, బర్త్‌ సర్టిఫికేట్‌కు ముందే.. ఫొటోతో కార్డు జారీ : యూఐడీఏఐ

న్యూఢిల్లి: ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్‌ కార్డులను జారీ చేసేందుకు ఆధార్‌ కార్డు జారీ సంస్థ యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం తరలో ఆస్పత్రుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రారంభించనుంది. అంతా ప్లాన్‌ ప్రకారం.. జరిగితే.. పిల్లలకు జనన ధృవీకరణ పత్రం రాకముందే.. వారికి ఆధార్‌ కార్డు వస్తుంది. సాధారణంగా జనన ధృవీకరణ పత్రం పొందడానికి నెల రోజులు పడుతుంది. యూడీఐఏఐ సీఈఓ సౌరభ్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. నవజాత శిశువులకు ఆధార్‌ నెంబర్లను ఇవడానికి తాము బర్‌ ్త రిజిస్ట్రార్‌తో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే వయోజన జనాభాలో 99.7 శాతం మంది ఆధార్‌ పరిధిలోకి వచ్చారన్నారు. దీని కింద ఇప్పటి వరకు దేశంలో 131 కోట్ల మంది జనాభా నమోదు చేసుకున్నారన్నారు. ఇప్పుడు తమ ప్రయత్నం నవజాత శిశువులను చేర్చుకోవడమని చెప్పారు.

ఏటా 2.25 కోట్ల పిల్లల జననం
ఏటా రెండు నుంచి 2.5 కోట్ల మంది పిల్లలు పుడుతున్నారన్నారు. వాటిని ఆధార్‌లో నమోదు చేసే ప్రక్రియలో ఉన్నామని తెలిపారు. బిడ్డ పుట్టినప్పుడు ఫొటోను క్లిక్‌ చేయడం ద్వారా ఆధార్‌ కార్డు ఇస్తామనీ వెల్లడించారు. 5ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి బయోమెట్రిక్‌ తీసుకోమన్నారు. వాఇ తల్లిదండ్రులతో లింక్‌ చేస్తామని వివరించారు. 5 ఏళ్లు దాటిన తరువాత బయోమెట్రిక్‌ నమోదు చేస్తామని తెలిపారు. మొత్తం జనాభాకు ఆధార్‌ నెంబర్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఏడాది దాదాపు 10కోట్ల మంది తమ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌లను అప్‌డేట్‌ చేస్తున్నారన్నారు. 140 కోట్ల బ్యాంకు ఖాతాల్లో 120 కోట్ల ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని వివరించారు. ఓటర్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయనున్నామని, ఇటీవల కేబినెట్‌ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించిందని గుర్తు చేశారు. బోగస్‌ ఓటింగ్‌ను నిరోధించడమే దీని లక్ష్యం అని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement