ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు మే 22కి బదులుగా మే 19న దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకనున్నాయని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది జూన్ 1 వరకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని, జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
మరోవైపు.. రానున్న 5 రోజుల్లో.. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, మధ్య మహారాష్ట్ర, మారాఠ్వాడాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఆయా ప్రాంతంలో కనిపిస్తున్న అల్పపీడణ ద్రోణి ఇందుకు కారణం అని వివరించింది.