Tuesday, November 26, 2024

IMD | దేశంలో నైరుతి ఎంట్రీపై ఐఎండీ క్లారిటీ…. జులై నాటికి వ‌ర్షాలు

ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు మే 22కి బదులుగా మే 19న దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలను తాకనున్నాయని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది జూన్ 1 వ‌ర‌కు నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని, జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

మరోవైపు.. రానున్న 5 రోజుల్లో.. మధ్యప్రదేశ్​, విదర్భ, ఛత్తీస్​గఢ్​, మధ్య మహారాష్ట్ర, మారాఠ్వాడాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఆయా ప్రాంతంలో కనిపిస్తున్న అల్పపీడణ ద్రోణి ఇందుకు కారణం అని వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement