కర్నాటక మాజీ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. దేశం నలుమూలల నుంచి ఆయన వ్యాఖ్యలపై వస్తున్న వ్యతిరేకతకు తలొగ్గిన ఆయన.. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ టీట్ ద్వారా క్షమాపణ చెప్పారు. గురువారం సభను పొడగించాలనే డిమాండ్‌పై నిండు అసెంబ్లిలో చర్చ జరుగుతోంది. అలాంటి సమయంలో.. మాజీ స్పీకర్ అయిన రమేష్ కలగజేసుకొని.. చూడండి.. ఒక సామెత ఉంది.. అత్యాచారం.. అనివార్యమైనప్పుడు.. పడుకుని ఆనందించండి అని అన్నారు.
మీరు ఉన్న స్థానం సరిగ్గా అదే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో రమేష్ కుమార్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో.. శుక్రవారం క్షమాపణ తెలిపాడు. రేప్ గురించి నేటి అసెంబ్లి నేను చేసిన ఉదాసీనత.. నిర్లక్ష్య వ్యాఖ్యలకు ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ఉద్దేశం క్రూరమైన నేరాన్ని చిన్నచూపు లేదా తేలికంగా చేయడం కాదు.. కానీ ఆఫ్ ది కఫ్ రిమార్క్.. ఇక మీదట నేను నా మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటాను.. అంటూ టీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital