Monday, November 18, 2024

ఔషధాలతో అనారోగ్యం.. తగ్గుతున్న రోగనిరోధక శక్తి

ప్రభన్యూస్‌ : ప్రాణహాని జరుగ కుండా చూడాల్సిన వైధ్యులే అనారోగ్యానికి కారకుల వుతున్నారు. చికిత్స కోసం రోగులు ఆస్పత్రికి వస్తే చాలు కొందరు వైధ్యులు అవసరానికి మించి మందులు రాస్త్తున్నారు. రోగికి చికిత్సలో భాగంగా రాస్తున్న మందులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైధ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీని వల్ల రోగ నియంత్రణ శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. అవసరం లేనప్పటికీ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అందినంత ఫీజులను వసూలు చేస్తున్న డాక్టర్లు. దీంతో పాటు మందు బిళ్ళలు, ఇంజక్షన్లను సైతం వారి ఆర్థిక ప్రయోజనాలకోసం రోగులకు అంటకడుతున్నారు.

అవగాహన లోపం.. రోగులకు శాపం..

చికిత్సకు వచ్చే వారిలో చాలామందికి వైధ్యంపై అవగాహన లేకపోవడం మెడికల్‌ షాపుల యజమానులకు, వైధ్యులకు వరంగా మారుతుంటే రోగులకు మాత్రం శాపంగా మారుతోంది. విద్యాధికుల నుంచి నిరక్షరాస్యుల వరకు ఈ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఎంత చదువుకున్నా చదువుకోలేకపోయినా ఏమందు అవసరమో కాదో తెలియని స్థితిలో మొత్తం మందులు కొనాల్సి వస్తోంది. డాక్టర్లు రాసిన మందులు కొనకపోతే రోగం తగ్గదనే భావనతో చికిత్సకు వచ్చిన వారు మొత్తం మందులను కొనుగోలు చేస్తున్నారు. అవసరానికి మించి మందులు రోగులు తీసుకుంటుండటంతో రాబోయే రోజుల్లో ఇతర మందులు పనిచేయని పరిస్థితి ఉంటుందని వైధ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా డాక్టర్లు రాసే హైడోస్‌ మందులు, అధిక మందుల వల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement