Friday, November 22, 2024

అక్రమ మద్యం, 45 ద్విచక్ర వాహనాల సీజ్‌.. రౌడీ షీటర్‌, 10 మంది అనుమానితుల అరెస్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పోలీస్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌ ఆదేశానుసారం ఈస్ట్‌ జోన్‌ డిసిపి సునీల్‌ దత్‌ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులతో చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పద్మానగర్‌ కాలనీలో కార్డెన్‌ సర్చ్‌ను (నిర్భంధ తనఖీలను) నిర్వహించినట్లు అడిషనల్‌ డిసిపి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలలో 10 మంది అనుమానితులను కమల్‌ సింగ్‌ అనే రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నామని, అంతే కాకుండా వీరి వద్ద నుండి సరైన ధృవపత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

అలాగే డొమెస్టిక్‌ నుండి కమర్షియల్‌కు అక్రమంగా గ్యాస్‌ రీఫిలింగ్‌కు ఉపయోగించే 7 వంట గ్యాస్‌ సిలిండర్లను సీజ్‌ చేసి రిజాక్‌ అనే నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఆదివారం నాడు ఈ మేరకు అడిషనల్‌ డిసిపి శ్రీనివాస్‌ రెడ్డి ఓక ప్రకటన విడుదల చేస్తూ బెల్ట్‌ షాపులు నిర్వహించే వారి నుంచి 65 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని జంతువుల నుండి తయారు చేసే 75 కేజీల కల్తీ ఆయిల్‌ను సీజ్‌ చేసినట్టు తెలిపారు. మద్యం, గ్యాస్‌ సిలిండర్‌ తదితర ఘటనలపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని అడిషనల్‌ డిసిపి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇలాంటి నిర్బంధ తనిఖీలు నిర్వహించడం ద్వారా ప్రజలలో నమ్మకం కలుగుతోందన్నారు. వివిధ నేరాలకు పాల్పడే వారికి స్థావరాలు లేకుండా ఉంటుందని, చట్ట విరుద్దంగా కార్యకలాపాలకు పాల్పడే అవకాశం లేకుండా ఉంటుందని అడిషనల్‌ డిసిపి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement