Friday, November 22, 2024

Illicit Liquor – త‌మిళ‌నాడులో నాటు సారా భూతం .. ఇప్ప‌టికే 37 మంది బ‌లి


చావు బ‌తుక‌ల‌లో మ‌రో 60 మంది
ముఖ్య‌మంత్రి స్టాలిన్ సీరియ‌స్
జిల్లా క‌లెక్ట‌ర్ పై బ‌దిలీ వేటు
జిల్లా ఎస్పీ సస్పెండ్
ఒక్క‌రికి రూ.10 ల‌క్ష‌లు న‌ష్ట ప‌రిహారం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న

తమిళనాడులోని కల్లకురిచ్చిలో కల్తీ నాటుసారా తాగి మరణించిన వారి సంఖ్య 37కి పెరిగింది. మ‌రో 60 మంది చికిత్స పొందుతున్నారు… ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి స్టాలిన్ అధికారుల‌పై క‌న్నెర్ర చేశారు..కల్లకురిచి కలెక్టర్‌పై బదిలీ వేటు వేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్‌ చేశారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై స్టాలిన్ నేడు అసెంబ్లీలో మాట్లాడారు.. దీనిపై విచార‌ణ సిబిఐకి అప్ప‌గించామ‌న్నారు.. ఈ కేసులో ఇప్ప‌టికే ఇద్ద‌ర్ని అరెస్ట్ చేశామ‌న్నారు.. ఈ జిల్లాలోని అన్ని సారా దుకాణాల‌ను మూసివేయించామ‌ని, స్టాక్ పాయింట్ల‌లో ఉన్న సారాను ప‌రీక్ష‌ల కోసం పంపామ‌ని చెప్పారు.. .ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోకుల్ దాస్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement