ప్రభ న్యూస్, హైదరాబాద్: మహా నగరంలో మాయగాళ్లు అనే పేరుకు కేరాఫ్ అడ్రస్‌గా శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు నిలుస్తున్నాయి. మారుతు న్న విద్యావిధానాలు, విద్యారంగంలో వస్తున్న నూతన సాంకేతిక అంశాలను దృష్టి లో ఉంచుకుని కార్పొరేట్ విద్యా సామాజ్రాన్ని ఏలుతున్న ఈ విద్యాసంస్థ లు అందినంత నొక్కేస్తున్నాయి. ఐఐటీ, జేఈఈ కోర్సుల పేరిట విద్యార్థులు, వారి తల్లిదండ్రు లకు ఎర వేసి లక్షల రూపాయలను ఫీజులు రూపంలో గుంజుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం నిర్దేశించిన విద్యా సంవత్సర క్యాలెండర్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ, విద్యార్థుల పట్ల పాశవికంగా వ్యవహరిస్తున్నాయి. లేలేత వయస్సులో, నూనూగు మీసాల ప్రాయంలో ఇం టర్‌లో అడుగుపెడుతున్న చిన్నారులు, సమాధులకు చేరేలా వీరి చర్యలుంటున్నాయి. దీంతో ప్రతి ఏడాది 500 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థి తులు దాపురించాయి. చదువుల కోసం పంపితే, చంపి శవాలను తల్లిదండ్రులకు అప్పగిస్తున్నా, కనీస చర్యలు తీసుకోవడంలో అటు పాలకులు, ఇటు ఇంటర్ బోర్డు అధికారులు విఫలమైనట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాలన్నీ ఇంటర్ బోర్డులోని అధికారులకు, ఇతర ఉన్నతాధికారులకు, చివరికి ప్రభుత్వ పెద్దలకు తెలిసినా బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం లేదు.
ఐఐటీ సీట్ల పేరిట మోసం.!
దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు కేవలం 16వేలు ఉన్నట్లు సమాచారం. ఇందులో గత 2022లో తెలంగాణకు వచ్చిన సీట్లు కేవలం 1600 మాత్రమే. అయితే ఈ ఐఐటీ సీట్ల కోసం పరీక్ష రాసే విద్యార్థులు సుమారు లక్ష మందికి పై గా ఉంటారు. ఈ లక్ష మంది విద్యార్థులను శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాల లు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించుకుంటూ, ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నా యి. ఈ విద్యా మాఫియా దెబ్బకు సామాన్య, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలవు తున్న పరిస్థి తులు నెలకొన్నాయి. వీరికి సంబంధిత విద్యాశాఖ అధికారులు సంపూర్ణంగా సహకారమం దిస్తుండటంతో విద్యా వ్యాపారం దర్జాగా సాగిపోతుం ది. ఈ కళాశాలల్లో చేరే విద్యార్థుల్లో దాదాపు 90 శాతం మంది ఎంసెట్ కోసమే ప్రవేశం పొందుతున్నట్లు తెలుస్తుండగా, వీరిలో 1 లేదా 2శాతం మంది విద్యా ర్థులు మాత్రమే ఐఐటీ మెయిన్స్‌కీ, అడ్వాన్స్‌డ్‌కు సెలె క్టు అవుతున్నారు. చదువుతున్న విద్యార్థుల సంఖ్యను దాచి, ఉత్తీర్ణులైన వారిని చూపుతూ ఈ విద్యాసంస్థ ల యాజమాన్యాలు అందినంత పోగేసుకుంటున్నాయి. పిల్లలకు బేసిక్స్‌ను అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు చేర్చుకుంటున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలుచేస్తూ, విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తుండటంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సూపర్ చైనా, సూపర్ స్టార్, ఎన్1-20ల పేరుతో ఐఐటీ సీట్లు సాధించాలంటే, శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థ ల్లోనే చేరాలనే విధంగా భారీస్థాయిలో వాణిజ్య ప్రకటనలు గుప్పించి, తల్లిదండ్రులు, వారి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అధికారులు కొత్త కళాశాలలకు అనుమతి నిస్తున్న సందర్భంలో కనీసం రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ హాస్ట ల్స్ పేరిట వెలుస్తున్న విద్యాసంస్థ లకు ఎలా అనుమతులు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థి తి నెలకొంది. హాస్ట ళ్ల నిర్వహణకు అనుమతులు లేనప్పటికీ, విచ్చలవిడిగా హాస్ట ల్స్ పెడుతూ విద్యార్థులను తమ ఆధీనంలో ఉంచుకొని, తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులను వసూళ్లు చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక ఇంటర్మీడియట్ విద్య పరిరక్షణకు ఇంటర్ బోర్డు నుంచి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి(డీఐఈవో)ల వ్యవహారం మరోరకంగా మారింది. వీరు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులుగానే వ్యవహరిస్తుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీఐఈవోలకు పదోన్నతులు కల్పిం చాలన్నా, వాళ్లు ఆ పదవిలో పూర్తికాలం కొనసాగాల న్నా నిర్ణయాధికారం ఆయా విద్యా సంస్థ ల యాజమా న్యాలదే అన్నంతగా పరిస్థి తులు మారిపోయాయి. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిబంధనలు, ఉత్త ర్వులను సైతం క్షణాల్లోనే ఆయా విద్యాసంస్థ ల ప్రతిని ధులకు చేరవేస్తుంటారన్న ఆరోపణలు మూటగట్టుకుం టున్నారు అధికారులు. తమకు అనుకూలంగా లేని నిబంధనలు, ఉత్తర్వులను కార్పొరేట్ వి ద్యారంగంలో రారాజులుగా రాజ్యమేలు తున్న శ్రీచైతన్య, నారాయణ యాజమాన్యాలు రాత్రికి రాత్రే తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సందర్భాలూ లేకపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు.