నటి ఇలియానా తల్లి అయింది. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని ఇలియానా నేడు అధికారికంగా ప్రకటించింది.. . ఈ మేరకు బాబు ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్‌చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ను మీకు పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేసింది.
ప్రస్తుతం ఆది సోషల్ మీడియాలో షేర్ అవుతున్నది. అభిమానులు, నెటిజన్లు ఇలియానాకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా, ఇలియానా నేటి వరకు వివాహం చేసుకోలేదు.. అలాగే తన బిడ్డకు తండ్రి ఎవరో కూడా ప్రకటించలేదు..