Friday, November 22, 2024

National : ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ఐఐటీ విద్యార్థి యత్నం…. ప‌ట్టుకున్న పోలీసులు…

ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ఓ విద్యార్థి య‌త్నం చేశాడు. ఐఎస్ఐఎస్‌కు ఆక‌ర్షితుడై ఉగ్ర గ్రూపులో చేరేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో అందులో చేరేందుకు వెళుతున్న ఐఐటీ-గౌహతి విద్యార్థిని అస్సాంలోని హజోలో పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

నాల్గొవ సంవత్సరం బయోటెక్నాలజీ చదువుతున్న ఐఐటీ గౌహతి విద్యార్థి.. ఐఎస్‌ఐఎస్‌ చేరేందుకు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో.. సదరు విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై విచారణ జరుగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జీపీ సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఐఐటీ-గౌహతి విద్యార్థి.. ఐఎస్ఎస్ లో చేరబోతున్నట్లు ఓ వ్యక్తి నుంచి తమకు ఇమెయిల్‌ ద్వారా సమాచారం అందించారని పోలీసు సూపరింటెండెంట్ కళ్యాణ్ కుమార్ పాఠక్ తెలిపారు. దీంతో ఐఐటీ-గౌహతి అధికారులను సంప్రదించామని ఆయన తెలిపారు.అయితే, ఆ విద్యార్థి మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడని, అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ గా ఉందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థి కోసం పోలీసులు పలు గ్రూపులుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టి.. గౌహతికి 30 కిలోమీటర్ల దూరంలోని హజో ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. సదరు విద్యార్థి ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. తర్వాత విద్యార్థి హాస్టల్ గదిలో సెర్చ్ చేయగా.. ఐఎస్ఐఎస్ మాదిరిగానే నల్ల జెండా కనిపించిందని.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

కాగా, బంగ్లాదేశ్ నుండి ధుబ్రి జిల్లాలో ఐఎస్ఐఎస్ ఇండియా హెడ్ హరీస్ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ, అతని సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌లను అరెస్టు చేసిన నాలుగు రోజుల తర్వాత విద్యార్థిని పట్టుబడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement