Friday, November 22, 2024

IGLOO THEATER : కోహెడలో ఇగ్లూ మినీ థియేటర్‌.. చూస్తే మతిపోవాల్సిందే..!

కోహెడ : కొన్ని ఏళ్ల నుండి ఈ ప్రాంత ప్రేక్షకులకు సినిమా చూసే కష్టాలు ఇక పోయినట్లే. ఈ ప్రాంత చుట్టు పక్కల ప్రజలు సినిమా చూడాలంటే 20 నుండి 35 కిలోమీటర్ల మేర ఉన్న హుస్నాబాద్‌ ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రం.. ఇప్పటి జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు వెళ్లాల్సిందే.. కానీ ఇక్కడి సినిమా ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌.. ఆ గుడ్‌న్యూస్‌ ఏంటి అంటారా.. మంచు ప్రాంతంలో నివసించే ఇల్లు ఆకారంలో ఉండే ఆకర్షణీయంగా ఉండే ఇగ్లూ థియేటర్‌ దానినే చోటా మహారాజ్‌ మినీ ధియేటర్‌ హాల్‌ అంటారు.

ఇక్కడి నిర్వాహకులు ముంబాయికి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని థియేటర్‌ లో 100 సీట్ల కెపాసిటీతో రోజుకు నాలుగు షోల వినోదాన్ని పంచటానికి మండల కేంద్రంలోని కూరేళ్లకు వెళ్లే దారిలో వెంకటేశ్వర మోడరన్‌ రైస్‌ అండ్‌ ఆయిల్‌ మిల్‌ ఆవరణలో దాదాపు 20 గుంటల స్థలంలో ఈ మినీ థియేటర్‌ ను నిర్మిస్తున్నారు. ఈ మినీ థియేటర్‌ దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగతా పది శాతం పనులు పూర్తిచేసే త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నారు. ఈ ఆలోచన ముంబై చోటు సంస్థ వారి నమూనాను చూసి అన్ని వివరాలు తెలుసుకుని ఇక్కడ నిర్మిస్తున్నట్లు వాళ్ళు తెలిపారు.

ఇగ్లూ థియేటర్లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు- దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్నట్లు, మిని థియేటర్‌ వంద సీట్ల కెపాసిటీ-, ఫుల్‌ ఏసీ, హై క్వాలిటీ సౌండ్‌ సిస్టంతో రోజుకు ఐదు షోలు ఉంటాయని యాజమాన్యం తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఇగ్లూ థియేటర్లు నిర్మాణంలో ఉన్నాయని ఉత్తర తెలంగాణలో రెండు.. ఒకటి జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం రాజారామ్‌పల్లిలో, రెండోది ఖమ్మం జిల్లాలోని కల్లూరులో నిర్మిస్తున్నారు. మన జిల్లాలో ఇదే మొదటిది దీని వ్యయం దాదాపు కోటి రూపాయలు వరకు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు. ఈ థియేటర్‌కు యువతి యువకులు కుటు-ంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులకు సినిమాతో పాటు క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు అలాగే విశాలమైన పార్కింగ్‌ స్థలం సిద్ధం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాంత సినీ ప్రేక్షకులకు ఈ థియేటర్‌ వినోదాన్ని పంచనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement