Saturday, November 23, 2024

ఐజీఎల్‌ కీలక నిర్ణయం.. సీఎన్‌జీ కిలో రూ.2 పెంపు

న్యూఢిల్లిd : ఇంద్రపస్తా గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) కీలక నిర్ణయం తీసుకుంది. కాంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. కిలో సీఎన్‌జీపై రూ.2 పెంచినట్టు వివరించింది. ఈ కొత్త ధరలు ఢిల్లి ఎన్‌సీఆర్‌లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. తాజాగా పెంచిన ధరల కారణంగా.. ఢిల్లిలో కిలో సీఎన్‌జీ రూ.73.61కు చేరుకుంది. నోయిడాలో రూ.76.17, గుర్‌గ్రామ్‌లో రూ.81.94కు పెరిగింది. ఢిల్లి-ఎన్‌సీఆర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సీఎన్‌జీ గ్యాస్‌ ధరలను పెంచినట్టు ఐజీఎల్‌ స్పష్టం చేసింది.

రేవరిలో కిలో సీఎన్‌జీ రూ.84.07, కర్నాల్‌తో పాటు కైథాల్‌లో రూ.82.27, కాన్పూర్‌లో రూ.85.40, హమీర్‌పూర్‌, ఫతేపూర్‌, పాలీతో పాటు అజ్మీర్‌లో కిలో సీఎన్‌జీ రూ.83.88కు చేరుకుంది. గతేడాది అక్టోబర్‌ నుంచి ఐజీఎల్‌ దేశీయంగా సీఎన్‌జీ ధరలు పెంచుతూ వస్తున్నది. అంతర్జాతీయంగా గ్యాస్‌ ధరలు పెరుగుతుండటంతో.. దేశీయంగా కూడా సీఎన్‌జీ ధరలు పెంచాల్సి వస్తున్నదని ఐజీఎల్‌ అభిప్రాయపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement