హైదరాబాద్, ఆంధ్రప్రభ : రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 29న (శుక్రవారం) సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగాజమున తహజీబ్‌కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్నది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలు పరుస్తున్నది. లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..