Tuesday, November 26, 2024

కంటి చూపు బాగుంటే ఏ పనైనా చేసుకోగలం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : కంటి చూపు బాగుంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
దృష్టి లోపాన్ని సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని ఖమ్మం నగరం 23వ డివిజన్ లోని శాంతి నగర్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యల పై దృష్టి పెట్టానని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.

కంటి వెలుగు ఒక మంచి ప్రజా ప్రయోజిత కార్యక్రమం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభిస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కితాబునిచ్చారని, కంటి వెలుగు మొదటి విడతలో 1 కోటి 50 లక్షల మందికి స్క్రీనింగ్ చేసి 50 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసామని గుర్తు చేశారు. ఇంత గొప్ప పథకాలని అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యాంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలని కోరుతున్నానని అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయ‌ర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్ మక్బూల్, డీఎంహెచ్ వో మాలతి, డాక్ట‌ర్ ఎవాంజలిన్, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement