అవి సర్పంచ్ ఎన్నికలే కానీ, మైండ్ బ్లాక్ అయ్యే అంశాలను తన ఎన్నికల ఎజెండాలో పొందుపరిచాడో వ్యక్తి. అవి చూసిన జనం.. అవునా.. ఇవన్నీ నిజంగా చేస్తాడంటారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇది ఇప్పుడున్న ఎన్నికల పరిస్థితిని తెలియజేస్తోందని, ఇట్లాంటి బూటకపు మాటలు చెప్పే చాలామంది గెలిస్తున్నారని ఇంకొంతమంది అంటున్నారు.
అయితే.. హర్యానాలోని సిర్సద్ చెందిన జైకరణ్ తన ఎన్నికల మేనిఫెస్టోని ఓ పోస్టర్ రూపంలో ప్రచురించాడు. అందులో తాను సర్పంచ్‌గా గెలిస్తే రూపాయలకే లీటర్ పెట్రోల్, రూ.100 కే గ్యాస్ సిలిండర్ అందిస్తానని తెలిపాడు. అంతేకాకుండా గ్రామం మొత్తం ఫ్రీగా వైఫూ అన్‌లిమిటెడ్‌గా ఉంటుందని, రోజుకు ఒక్కొక్కరికి ఒక లిక్కర్ బాటిల్ కూడా ఫ్రీగా ఇస్తానని తెలిపాడు.
ఇక.. విలేజ్ చుట్టూ మూడు ఎయిర్‌పోర్టులు, 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి 5 నిమిషాల్లో హెలకాప్టర్ సౌకర్యం కల్పిస్తానని కూడా పోస్టర్లో పేర్కొన్నాడు. అయితే దీన్ని చాలామంది ఫన్నీగా తీసుకుని షేర్ చేసుకుంటుండడంతో వైరల్‌గా మారింది.