Wednesday, November 20, 2024

Spl story | సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు షేర్ చేస్తే జైలుకే..

ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీని సేఫ్ గా ఉంచ‌డానికి ఫ్రెంచ్ లో కొత్త చట్టాన్ని ఆమోదించారు. ఈ కొత్త రూల్ ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లల ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడాన్ని బ్యాన్ చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయకుండా నిషేధిస్తూ ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లులోని మొదటి రెండు ఆర్టికల్స్ పిల్లల ప్రైవసీ ప్రొటెక్షన్ తల్లిదండ్రుల బాధ్యతల్లో ఒకటిగా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను షేర్ చేయకుండా నిషేధిస్తూ ప్రపంచంలోనే తొలి బిల్లు ఇది. ఈ బిల్లు ఫ్రెంచ్ సెనేట్ ద్వారా వెళ్లి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత, ఇది దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.

అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పార్టీకి చెందిన ఫ్రెంచ్ ఎంపీ బ్రూనో స్టూడర్ ప్రతిపాదించిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఒక 13 ఏళ్ల పిల్లలకి సంబంధించి సగటున 1,300 ఫోటోలు ఇంటర్నెట్‌లో ఉన్నాయని స్టూడర్ వెల్లడించారు. ఈ ఫోటోలతో పిల్లల అశ్లీలత (child pornography) కోసం ఉపయోగించే అవకాశం ఉందని లేదా పాఠశాల వాతావరణంలో బెదిరింపులకు దారితీయవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -

స్టూడర్ ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పుడు వారికి తెలియకుండానే చైల్డ్ పోర్నోగ్రఫీకి సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త‌ బిల్లు ప్రకారం, చైల్డ్ ఫోర్నోగ్రఫీ కోసం సోషల్ మీడియాలో నుంచి ట్రేడ్ అయిన 50 శాతం ఫోటోల్లో తల్లిదండ్రుల పోస్ట్ చేసినవే అని తెలుస్తోంది.

పిల్లల చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయాలనే నిర్ణయం పిల్లల “వయస్సు – మెచ్యూరిటీ స్థాయి” ఆధారంగా తీసుకోబడుతుంది, తల్లిదండ్రులు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లయితే, పోస్టింగ్ పరిమితులను విధించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. అలాగే వారి పోస్ట్‌ల కారణంగా పిల్లల గౌరవం లేదా నైతిక సమగ్రతపై ప్రభావం పడితే, తల్లిదండ్రులు వారి పిల్లల ఫోటోలపై అధికారాన్ని కూడా కోల్పోతారు. కొత్త చట్టం సరైన దిశలో వెళుతుందని కొందరు నిపుణులు ప్రశంసించగా, మరికొందరు ఇది తగినంతగా ముందుకు సాగడం లేదని వాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement