హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం జపాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టును కలిగి ఉన్న దేశంగా నిలిచింది. భారతదేశానికి 60 దేశాలకు యాక్సెస్‌ను అందిస్తూ 87వ స్థానం దక్కించుకుంది. దీని అర్థం భారతీయ పాస్ పోర్టు హోల్డర్ ఇప్పుడు ముందస్తు వీసా అవసరం లేకుండానే వారి కలల గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. కొవిడ్ మహమ్మారి కారణంగా భారత దేశం అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాన్ని విధించింది. మార్చి 2022లో ఉపసంహరించబడింది. దీంతో రెండేళ్ల తర్వాత టూరిజం పరిశ్రమ కోలుకోవడానికి దోహదపడింది. పాస్ పోర్టు ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చడానికి సహాయపడిందని నివేదికలు చెబుతున్నాయి.
హాన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ నివేదికల ప్రకారం జాబితాలోని మొదటి పది దేశాల్లో జర్మనీ, స్పెయిన్, ఇటలీ, సింగపూర్, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, ఇటలీ, ఆస్ట్రియా డెన్మార్క్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఫ్రాన్స్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, కెనెడా తదితర దేశాలు ఉన్నాయి. అలాగే భారతీయ పాస్ పోర్టు హోల్డర్లు వీసా లేకుండా ప్రయాణించగల దేశాల పూర్తి జాబితా కూడా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.