దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగిరెగిరి పడితే అనుభవాలు ఇలానే ఉంటాయని, ఆడియెన్స్ రియాక్షన్ ఇలానే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మేం ఎంతో కష్టపడి సినిమా తెరకెక్కించామని, మా సినిమాని చూడాలని ఆడియెన్స్ కి చెప్పాలని, ఏ యూనిట్ అయినా తమ సినిమాని ఆడియెన్స్ లో ప్రమోట్ చేసుకుంటే సరిపోతుందని, అంతేకానీ మనం చిటికేస్తే, ఆడియెన్స్ ఇలాంటి సమాధానమే చెబుతారని తెలిపారు. మన యాక్షన్ పైనే ఆడియెన్స్ రియాక్షన్ ఆధారపడి ఉంటుందన్నారు.
సినిమా విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఎగిరెగిరి పడవద్దన్నారు. దేశాన్ని తగలెడదాం, ఊరుని తగలెడదాం అంటూ చివరికి మనల్ని తగలెడతారని చెప్పారు. అలా చేస్తే ఇలాంటి అనుభవాలే ఫేస్ చేయాల్సి వస్తుందని లైగర్ చిత్రాన్ని ఉద్దేశించి తమ్మారెడ్డి తెలిపారు. లైగర్‌పరాజయంపై ఆయన స్పందిస్తూ, ఈ చిత్రం గురించి తాను ఎక్కువగా మాట్లాడనని, తాను పూరీ జగన్నాథ్‌కి పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. ఆయన సినిమాలంటే తనకు ఇష్టమని, కానీలైగర్‌ట్రైలర్ చూసినప్పుడే నచ్చలేదన్నారు. ఒకవేళ మున్ముందు సినిమా చూడాలనిపిస్తే చూస్తానని తెలిపారు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించినలైగర్‌్ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. ఆగస్ట్ 25న విడుదలైన ఈ సినిమా పరాజయం చెందింది. భారీ అంచనాలతో, భారీ ప్రమోషన్స్ నడుమ విడుదలైన ఈ సినిమా నిరాశ పరచడం పట్ల చాలా ట్రోల్స్ వైరల్ అయ్యాయి.