తిరువనంతపురం: ప్రభుత్వ ఉద్యోగ నియామకమంటే… ఎంతో ప్రక్రియ ఉంటుంది. వారసత్వ ఉద్యోగాల విషయంలోనైనా సరే ఎన్నో చర్యలు తీసుకుంటారు. అలాంటి కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే అకాల మరణం కారణం చూపి, ఆయన కుమారుడికి ఎలా ఉద్యోగమిస్తారని కేరళ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ నియామకాన్ని రద్దు చేసింది. అతనో అధికార ఎమ్మెల్యే.
ఎన్నికైన రెండేళ్లకు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆయన కుమారుడికి ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగం కల్పించింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యే కుమారుడికి ఏ అర్హతతో ఉద్యోగం ఇచ్చారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సర్కార్ ను ప్రశ్నించాయి. ఇదే అంశంపై అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.