ప్రభన్యూస్ : ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తున్నా.. చాలా మంది టీకా వేయించుకోవడం లేదు. కొన్ని చోట్ల కఠిన చర్యలు తీసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల టీకా వేసుకున్న వారికి బహుమతులు అందజేస్తోంన్నారు. ఇదే కోవలో గుజరాత్‌లోని రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ చేరింది. కరోనా వ్యాప్తి నివారణకు.. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతోంది. శనివారం నుంచే ప్రారంభమైన ఈ డ్రైవ్.. 10వ తేదీ వరకు కొనసాగుతుంది. టీకా వేసుకుంటే.. రూ.50వేల స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు.
లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేయనున్నట్టు రాజ్‌కోట్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. టీకాలు తీసుకున్నవారితో పాటు.. వ్యాక్సిన్ వేసిన వారికి కూడా ప్రత్యేక బహుమతులు అందజేయనున్నారు. ఈ ప్రత్యేక టీకా డ్రైవ్‌లో ఎక్కువ మందికి టీకాలు వేసిన ఆరోగ్య కేంద్రానికి పురపాలక సంఘం రూ.21,000 బహుమతిని ప్రకటించింది. రాజ్‌కోట్‌లో దాదాపు 1.82 లక్షల మంది ఇంకా రెండో డోస్ తీసుకోలేదు. 22 ఆరోగ్య కేంద్రాల్లో 12 గంటల పాటు వ్యాక్సిన్ వేయనున్నారు. అహ్మదాబాద్ మున్సిపాల్టిd కూడా లక్కీ డ్రా పోటీని ప్రకటించింది. విజేతకు రూ.60వేల స్మార్ట్‌ఫోన్ ఇవ్వనుంది. డిసెంబర్ 1 నుంచి 7వ తేదీల మధ్య వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నవారు మాత్రమే దీనికి అర్హులు. శనివారం గుజరాత్‌లో ఒమిక్రాన్ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital