Tuesday, November 26, 2024

Spl Story | ఈ ప్రయోగం పూర్తి అయితే, కరువు అన్న మాటే ఉండదు.. క్లౌడ్ సీడింగ్ తొలి దశ సక్సెస్

కరువు పరిస్థితులు ఏర్పడ్డపుడు, వర్షాల రాక ఆలస్యం అయినప్పుడు, పంటలు ఎండిపోయే దశలో ఉన్నప్పడు అంతా ఆకాశం వైపు చూసి వరుణ దేవుడికి మొక్కుకుంటారు. దేవుడా ఒక్క చినుకు రాల్చి మమ్మల్ని కాపాడవయ్యా అని కన్నీరు కారుస్తారు. అయితే.. ఇక మీదట ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఐఐటీ కాన్పూర్ వారు చేపట్టిన ఓ ప్రయోగం ఇప్పుడు కృత్రిమ వర్షం కురిపించేందుకు రెడీగా ఉంది. ఆ విశేషాలేమిటో చదివి తెలుసుకుందాం.

– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ

క్లౌడ్ సీడింగ్ అనే ప్రక్రియ ద్వారా కృత్రిమ వర్షం కురిపించడంలో సక్సెస్ అయ్యారు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించడంలో ఇది తమకు పెద్ద విజయం అంటున్నారు. క్లౌడ్ సీడింగ్ కోసం టెస్ట్ ఫ్లైట్‌ని నిర్వహించ‌గా.. అది సక్సెస్ అయినట్టు చెబుతున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పర్మిషన్తో ఈ పరీక్ష నిర్వహించారు.
ఇక.. కృత్రిమ మేఘాలను సృష్టించడానికి 5000 అడుగుల ఎత్తు నుండి ఒక పౌడర్‌ను విమానం ద్వారా జారవిడిచారు. క్లౌడ్ సీడింగ్ అనేది సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్, టేబుల్ సాల్ట్ తో సహా వివిధ రకాల రసాయన మిశ్రమాలను మేఘాలలో మిక్స్ చేయడం అన్నమాట.. ఇట్లా చేయడం ద్వారా మేఘాల గుంపు ఏర్పడుతుంది.

వర్ష కురిసే అవకాశాలను పెంచుతుంది. అయితే.. తీవ్రమైన వాయు కాలుష్యం, కరువు వంటి పరిస్థితులు సంభవించినప్పుడు క్లౌడ్ సీడింగ్ ఒక ర‌క‌మైన‌ ఉపశమనంగా ఉంటుందని ఐఐటీ పరిశోధకులు చెబుతున్నారు. కాగా, IIT కాన్పూర్ వారు ఈ ప్రాజెక్ట్ ను 2017లో ప్రారంభించారు. దీనికి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం నాయకత్వం వహించింది. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఈ పరీక్ష నిర్వహణను ధ్రువీకరించారు.

- Advertisement -

కృత్రిమ వర్ష పరీక్ష విజయవంతమైంది..

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఐఐటీ కాన్పూర్‌లో ఒక విశిష్ట ప్రయోగం జరిగింది. ఇందులో క్లౌడ్ సీడింగ్ కోసం టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా నిర్వహించాం. ఈ పరీక్ష సమయంలో మేఘాల్లో మంటలు చెలరేగనందున వర్షం పడలేదు. అయితే.. ఈ ప‌రీక్ష కేవ‌లం పరికరాల ట్రయల్ రన్ కోస‌మే చేశాం. కానీ, క్లౌడ్ సీడింగ్ పరీక్ష విజయవంతమైంది. ఇప్పుడు మేము తదుపరి దశల్లో క్లౌడ్ సీడింగ్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామం. మేము కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాం. కరోనా కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమైంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే క్లౌడ్ సీడింగ్ ట్రయల్‌కు అనుమతి ఇచ్చింది”అని వివరించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement