ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు పేవల ప్రదర్శన కనబరుస్తొంది. టోర్నీలో భగంగా ఇప్పటి వరకు పాక్ జట్టు 6 మ్యాచులు ఆడగా.. మొదటి రెండు మ్యాచుల్లో మినహా మరో మ్యాచ్‌లో విజయం సాధించలేదు. పాకిస్థాన్ ఇలా వరుసగా మ్యాచులు ఓడిపోతుండటంతో కెప్టెన్ బాబర్ ఆజాం సహా మిగిలిన ఆటగాళ్లు అందరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంకా బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉందని అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు అందడవం లేదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌కు గత రెండు రోజులుగా కెప్టెన్ బాబర్ ఆజాం మెసేజ్‌లు చేస్తున్నప్పటికీ వారి ఎలాంటి స్పందన లేదు. ఓ కెప్టెన్ తోనే వారు మాట్లాడకుంటే ఎలా అని లతీఫ్ ప్రశ్నించారు.
వారు ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి..? ఆ విషయాలు తెలియడం లేదు. పీసీబీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక.. ప్రపంచకప్ ముందు ఆటగాళ్లు సంతకం చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ల ఒప్పందాన్ని పునః పరిశీలిస్తామని పీసీబీ చెప్పింది. దీంతో గత ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు అందలేదు. అలాంటప్పుడు ఆటగాళ్ల నుంచి ఇంతకంటే మంచి ప్రదర్శనను ఎలా ఆశించగలం అని అంటూ లతీఫ్ రషీద్ పీసీబీ తీరును తప్పుబట్టాడు