బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ మొబైల్ చూస్తామని అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగలమన్నారు. ఒరిజినల్ వీడియో దొరికేదాకా.. ఏమీ చెప్పలేమన్నారు. ఒక వ్యక్తి పంపిన వీడియోను షూట్ చేసి మరో వ్యక్తి పోస్ట్ చేశారన్నారు. ఈ వీడియోను ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ చేశారనే అనుమానాలున్నాయన్నారు. 447443703968 నెంబర్ నుంచి ఐ.టీడీపీ గ్రూప్ లో పోస్ట్ చేశారన్నారు. వీడియో లింక్ పై పూర్తిస్థాయిలో విచారణ చేశామన్నారు. ఎంపీ మాధవ్ ఇంతవరకు తమకు ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.
బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే.. ఎంపీ మొబైల్ చూస్తాం.. ఎస్పీ పక్కీరప్ప
Advertisement
తాజా వార్తలు
Advertisement