Friday, November 22, 2024

ఆ క్యాచ్‌ పడితే భారత్‌ గెలిచేది..

136 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచిన బంగ్లాదేశ్‌ను భారత ఫీల్డర్లు తమకు మాత్రమే సాధ్యమైన చెత్త ప్రదర్శనతో గెలిపించారు. లేని పరుగులుఉ ఇచ్చి, బౌండరీ వెళ్లేందుకు బంతికి దారి చూపి బంగ్లా విజయానికి దోహదపడ్డారు. ముఖ్యంగా కెఎల్‌ రాహుల్‌ కీలక సమయంలో మెహదీ హసన్‌ క్యాచ్‌ జారవిడిచి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.

42.3వ ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్లో బంతి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేవగా, సునాయసంగా అందుకోవల్సిన క్యాచ్‌ను రాహుల్‌ జారవిడిచాడు. అప్పటికీ బంగ్లా విజయానికి ఇంకా 32 పరుగులు 155/9 అవసరం ఉండింది. ఈ క్యాచ్‌ను రాహుల్‌ పట్టుకున్నట్లయితే టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించి ఉండేది. రాహుల్‌ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన మెహిదీ హసన్‌ ముస్తా ఫిజుర్‌ సహకారంతో ఫోర్లు, సిక్సర్లుబాది ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement