Friday, November 22, 2024

నాటో రంగంలోకి దిగితే, మూడో ప్రపంచ యుద్ధమే రష్యాను హెచ్చరించిన బిడెన్‌..

ఉక్రెయిన్‌పై దండయాత్రతో మారణహోమాన్ని సృష్టిస్తున్న రష్యాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ మరోసారి హెచ్చరించారు. ఈ యుద్ధంలోకి నాటో కాలుమోపాల్సి వస్తే, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని తేల్చిచెప్పాడు. అలాంటి దారుణ పరిణామాలు జరగకూడదనే ఉద్దేశంతోనే రష్యాతో నేరుగా పోరాటం చేయట్లేదని స్పష్టంచేశారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే గనుక, అందుకు క్రెవ్లిున్‌ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో ఐరోపాలోని మిత్రదేశాలుక సహాయం కొనసాగిస్తామని చెప్పారు. నాటో దేశాల భూభాగాల్లోని ప్రతి అంగుళాన్ని పరిరక్షించు కుంటాం. ఉక్రెయిన్‌లో రష్యా ఎన్నటికీ విజయం సాధించలేదు.

నాటో కూటమిలో విభేదాలు తీసుకొచ్చి దాన్ని బలహీనపరచాలన్న ఆయన కుట్రలు కూడా ఫలించలేదు అని శ్వేతసౌధం వద్ద ఆయన విలేకరులతో అన్నారు. కాగా, రష్యా సరిహద్దుల్లోని లాత్వియా, ఇస్తోనియా, లిథువేనియా, రొమేనియా వంటి దేశాలకు 12వేల మంది అమెరికా బలగాలను పంపినట్లు బిడెన్‌ వెల్లడించారు.మా మిత్ర దేశాలకు మేం ప్రమాదకర ఆయుధాలు, విమానాలు, యుద్ధ ట్యాంక్‌లను పంపుతున్నాం. అమెరికన్‌ పైలట్లు, సిబ్బందిని కూడా పంపబోతున్నాం. అంటే మీరే అర్థం చేసుకోండి అని రష్యాను హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement