Tuesday, November 26, 2024

రాష్ట్రపతి అయితే సీఏఏ అమలు చేయనివ్వను.. అసోం పర్యటనలో యశ్వంత్​ సిన్హా వెల్లడి

రాష్ట్రపతిగా తాను ఎన్నికైతే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కాకుండా చూస్తానని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బుధవారం అన్నారు. అస్సాం ప్రతిపక్ష శాసనసభ్యులతో ఇంటరాక్ట్ అయిన సిన్హా.. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం CAAని తీసుకొచ్చిందన్నారు. ఇది మూర్ఖపు చర్యగా అభివర్ణించారు.  అసోంకు పౌరసత్వం ఒక ప్రధాన సమస్యగా మారిందని, తొలుత కేంద్రం దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని కోరుకుందన్నారు. కానీ, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంగా ఆ పని చేయలేకపోయిందని చెప్పుకొచ్చారు. 

భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది బయటి శక్తి వల్ల కాదని, అధికారంలో ఉన్నవారి వల్లేనని సిన్హా ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే తమ తాపత్రయం అని అతను నొక్కి చెప్పారు. అందుకని తాను రాష్ట్రపతి భవన్‌లో ఉంటే కనుక CAA అమలు కాకుండా చూసుకుంటానన్నారు.  జులై 18న జరగనున్న ఎన్నికల కోసం భావ సారూప్యత కలిగిన పార్టీల మద్దతు కోరేందుకు సిన్హా అస్సాంలో ఒక రోజు పర్యటన చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement