Tuesday, November 26, 2024

TG | లంచం అడిగితే మాకు చెప్పండి.. ప్రజలకు ఏసీబీ పిలుపు

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రజలు తమతో కలిసి రావాలని తెలంగాణ ఏసీబీ పిలుపు ఇచ్చింది. ఇటీవల కాలంలో వరుస దాడులతో అవినీతి అధికారుల భరతం పడుతోంది. చిన్న చిన్న అవినీతి అధికారుల నుండి.. పెద్ద అవినీతి అధికారులకు వ‌ర‌కూ ఎవరినీ వదిలి పెట్టడం లేదు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు.. అదును చూసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది.

తాజాగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రజలు తమతో కలిసి రావాలని తెలంగాణ ఏసీబీ పిలుపు ఇచ్చింది. తెలుగులో చిరంజీవి నటించిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా హిందీ రీమేక్‌లోని లంచం సీన్‌ వీడియోను షేర్ చేసింది.

అవినీతికి వ్యతిరేకంగా ఓ వృద్ధుడు ఉద్యమించాడని, ఇలాంటి పరిస్థితులు మారాలంటే, అవినీతిని ఎదురించేందుకు సమాజంలోని అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఏసీబీ ట్వీట్‌ చేసింది. ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమకు వెంటనే చెప్పాలని ఏసీబీ పేర్కొంది. ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీకి టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు తెల‌పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement