Thursday, November 28, 2024

ఆడపిల్ల పుడితే ఫీజు లేదు.. 2400 మందికి ఉచితంగా ఆపరేషన్లు

పుణలోని డాక్టర్‌ రాక్‌ తను నడుపుతున్న మెటర్నటీ ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు ప్రసవంలో ఆడపిల్ల పుడితే ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 2400 మంది గర్భిణీలకు ఆపరేషన్లు ఉచితంగా అందించారు. అంతేగాదు బేబీ పుట్టిన రోజున ఘనంగ కేక్‌ కట్‌చేయడమే కాకుండా పులవర్షం కురిపిస్తారు. ఆస్పత్రి సిబ్బంది మొత్తం వేడుకల్లో పాల్గొని .. బేబీకి స్వాగతం చెబుతారు. డిశ్చార్చ్‌ రోజున ఆస్పత్రి సొంత ఖర్చులతో తల్లి, బిడ్డను ఇంటికి చేరుస్తారు. ఇలాంటి ఉదార స్వభావం గల డాక్టర్ గణేష్‌ రాక్‌ 11 సంవత్సరాలుగా ఇలాంది వైద్యాన్ని అందిస్తున్నారు. బేటీ బచావో చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఓసారి ఆస్పత్రిలో మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చిందంటే బంధువులు, తండ్రి చూడటానికి రాలేదని .. ఆ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసినట్లు చెప్పారు. 2012న ఆస్పత్రిలో మహిళ ఆడపిల్ల పుట్టిందని చూడటానికి కూడా రాలేదని అన్నారు. అప్పటినుంచి ఎలాగైనా ఆడపిల్ల తక్కువ అనే భావన పొగొట్టేలా .. లింగ సమానత్వం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సర్వేల ప్రకారం పదేళ్లలో ఆరుకోట్ల మంది ఆడశిశువులను బ్రూణహత్యలకు పాల్పడ్డారని రికార్డులు చెబుతున్నాయన్నారు. వీటిపై కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ఇది జాతిహత్యగా పేర్కొన్నారు. ఇటీవల బ్రూణ హత్యలు గణనీయంగా తగ్గాయని .. ఇది సానుకూల నిర్ణమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement