జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కుట్రను భద్రతా బలగాలను భగ్నం చేశాయి. భారత్ – పాక్ సరిహద్దుల్లో చిన్నారుల టిఫిన్స్ బాక్సుల్లో ఉన్న ఐఈడీ బాంబులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అఖ్నూర్ సెక్టార్‌లో డ్రోన్ కనిపించగా.. అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో డ్రోన్‌కు వేలాడుతున్న పార్సిల్ కిందపడింది. బలగాలను వాటిని స్వాధీనం చేసుకొని, విచారణ చేపట్టగా.. ఐఈడీ బాంబులుగా తేలాయి. ఐఈడీ బాంబుల్లో టైమర్ చేసినట్లు తెలుస్తున్నది. మంగళవారం అఖ్నూర్‌లోని కనాచక్ ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్ కదలికలను బీఎస్‌ఎఫ్ గుర్తించగా.. వెంటనే సైనికులు డ్రోన్‌పై కాల్పులు జరిపారు.
డ్రోన్‌కు వేలాడుతున్న పార్సిల్ కిందపడగా చిన్నారులకు సంబంధించిన మూడు టిఫిన్ బాక్సుల్లో మూడు మాగ్నెటిక్ ఐఈడీలులను బలగాలు గుర్తించాయి. వాటిలో వేర్వేరుగా టైమర్ చేయగా.. వాటిని బలగాలు నిర్వీర్యం చేశాయి. ఇటీవల భారత్ – పాక్ సరిహద్దుల్లో డ్రోన్‌లు సంచరిస్తున్నాయి. అయితే, సరిహద్దు ఆవలి నుంచి జరిగే కుట్రలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని బోర్డర్ సెక్యూరిటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.