ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ రోజు ఐఈడీ పెలింది. ఈ ఘటనలో స్పెషల్ సెల్ పోలీసులు ఓ డీఆర్డీవో శాస్త్రవేత్తను అరెస్టు చేశారు. ప్రత్యర్థి లాయర్‌తో గొడవ నేపథ్యంలో ఆ శాస్త్రవేత్త పేలుడు కుట్రకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. డిసెంబర్ 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులోని రూమ్ నెంబర్ 102లో తక్కువ స్థాయి తీవ్రతతో పేలుడు జరిగింది. అయితే ఈ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి డీఆర్డీవో శాస్త్రవేత్త అని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. రెండు సార్లు అతను కనిపించాడని, ఒకసారి పేలుడు పదార్ధాలున్న బ్యాగుతో.. రెండో సారి బ్యాగు లేకుండా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో లిటిగేషన్‌లో ఉన్న డీఆర్డీవో శాస్త్రవేత్త.. లాయర్‌ను చంపాలని ప్లాన్ వేసినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. నిందితుడిపై సదురు లాయర్ పది కేసులు నమోదు చేశాడని, అసహనానికి గురైన అతను ప్రతీకారంతో పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది.