Tuesday, November 26, 2024

శరణార్థులకు గుర్తింపు కార్డులు: పోలాండ్‌

సరిహద్దులు దాటుకుని వచ్చిన ఉక్రేనియన్లకు పోలాండ్‌ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. శరణార్థులకు పెసెల్‌ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తోంది. తద్వారా పోలాండ్‌లో ఉద్యోగాలు చేసుకునేందుకు, పిల్లల చదువులకు మార్గం సులభమవుతుంది. వీటి ద్వారా ఈ వలసదారులకు 18 నెలలపాటు ఆరోగ్య, సామాజిక పథకాల ఫలాలు కూడా అందుతాయి. వీటిని తమకు అందిస్తున్నందుకు ఉక్రేనియన్‌ ప్రజలు పోలాండ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇది కొత్త ప్రదేశమని, కొత్త జీవితానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నామని వాళ్లు చెప్తున్నారు. ఈ కార్డు దారులందరికీ తొలి నెలలో పోలాండ్‌ ప్రభుత్వం నుంచి 70 డాలర్ల ఆర్ధిక సాయం అందుతుంది. అలాగే 18 ఏళ్లలోపు వారందరికీ నెలకు 117 డాలర్ల సాయం అందిస్తారు. ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకున్న వారు కూడా పోలాండ్‌ ప్రజల్లాగే పన్నులు కట్టాల్సి ఉంటుంది. యుద్దం మొదలైన నాటి నుంచి దాదాపు 20 లక్షల మంది ఉక్రెయిన్‌ నుంచి పోలాండ్‌కు వలసవచ్చినట్లు తెలుస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement