Thursday, November 21, 2024

ఐసీఎస్‌ఈ టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఫలితాల్లో 99.97 శాతం ఉత్తీర్ణత నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఐసీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తంగా 99.97 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో 99.8 శాతం స్కోరు సాధించి నలుగురు విద్యార్థులు టాప్‌ ర్యాంకులను సాధించినట్లు పేర్కొంది. బాలికలు 99.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురులు 99.97 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్థం సీఐఎస్‌సీఈ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు అధికారులు వెల్లడించారు. ట్యాప్‌ ర్యాంకులు సాధించిన వారిలో హర్‌గుణ్‌ కౌర్‌ మథరు(పుణ), అనికా గుప్తా(కాన్పూర్‌), పుష్కర్‌ త్రిపాఠి(బలరాంపూర్‌), కనిష్క మిత్తల్‌(లఖ్‌నపూ) ఉన్నారు. అదేవిధంగా 34 మంది విద్యార్థులు 99.6 శాతం స్కోరుతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మరో 72 మంది 99.4 శాతం స్కోరుతో మూడో ర్యాంకులో నిలిచినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement