Saturday, November 16, 2024

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ .. క్యు4 లాభం డబుల్‌

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గో త్రైమాసిక ఫలితాలను ఆదివారం వెల్లడించింది. క్యు4లో రూ.185 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో కేవలం రూ.64 కోట్ల నికర లాభాన్ని మాత్రమే పొందినట్టు వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యు4 కంటే ఈ ఆర్థిక సంవత్సరం క్యు4 నికర లాభాం రెండింతలు పెరిగింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు క్యు4 ఫలితాలకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను లాభం మాత్రం.. రూ.960 కోట్ల నుంచి రూ.754 కోట్లకు తగ్గినట్టు ప్రకటించారు. కొత్త వ్యాపారం గణనీయంగా పెరగడంతోనే క్యు4 నికర లాభంలో వృద్ధి నమోదైందని చెప్పుకొచ్చారు.

ఈ కాలంలో.. కొత్త వ్యాపారం విలువ 33.4 శాతం వృద్ధి చెంది రూ.2,63 కోట్లుగా నమోదైనట్టు తెలిపింది. ఈ మేరకు కంపెనీ బోర్డు డివిడెంట్‌ కూడా ప్రకటించినట్టు వివరించారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.0.55 పైసల చొప్పున డివిడెంట్‌ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బోర్డు తెలిపింది. కరోనా సమయంలో చాలా మంది బీమా పాలసీలపై ఆసక్తి చూపారని, అందుకే వృద్ధి రెట్టింపుగా నమోదైందని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇన్సూరెన్స్‌ పట్ల అవగాహన పెరగడం కూడా లాభాలకు కారణమని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement