ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్.. భారతదేశపు మొట్టమొదటి ఆటో ఈటీఎఫ్ అయిన.. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ నిఫ్టీ ఆటో ఈటీఎఫ్‌ను ప్రారంభించింది. ట్రాకింగ్ ఎర్రర్‌లకు లోబడి బెంచ్ మార్క్ నిఫ్టీ ఆటో ఇండెక్స్ మొత్తం రాబడికి దగ్గరగా ఉండే రిటర్న్‌లను అందించడమే ఈ సరికొత్త ఆటో ఈటీఎఫ్ లక్ష్యమని ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ స్ట్రాటజీ హెడ్ చింతన్ హరియా తెలిపారు. ఈ సరికొత్త ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ ద్వారా.. పెట్టుబడిదారులు భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమ.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోకి ప్రవేశించగలుగుతారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
ఆర్థిక వ్యవస్థలో ఆటో కీలకం
ఎలక్ట్రిక్ మొబిలిటీకి ప్రభుత్వ మద్దతు ఇస్తోందని, దీంతో పాటు ఆటో కాంపోనెంట్ సోర్సింగ్ భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందుతోందని, దీనికి ఇండియా గ్లోబల్ హబ్‌గా మారుతున్నది ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. నిఫ్టీ ఆటో ఈటీఎఫ్ అనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థలో.. ఆటోకి ఎంతో ప్రాధాన్యత ఉందని వివరించారు. ఈ రంగంలో పని చేసే కంపెనీల లాభాలు.. ఇన్వెస్టర్ల విశ్వాసాలకు అనుగుణంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ.. ఇది ఇతర రంగాలతో పోల్చితే.. మూలధనం (ఆర్‌ఓసీఈ), క్యాష్ జనరేషన్‌పై చాలా ఎక్కువ రాబడిని కలిగి ఉన్నదని వివరించారు. ఇది మంచి మార్జిన్లతో పాటు అత్యధిక అసెట్ టర్నోవర్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధిక కొనుగోలు శక్తికి దారితీసే సగటు గృహ ఆదాయం.. సాపేక్షంగా తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన కార్మికుల లభ్యత, రంగం అభివృద్ధికి సహాయపడే బలమైన పరిశోధన.. అభివృద్ధి కేంద్రాల ఉనికిని పెంచడానికి ప్రభుత్వ విధానాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పుకొచ్చారు.
పనితీరు ప్రతిబింబించేలా..
ఫైనాన్షియల్ మార్కెట్‌లోని ఆటో మొబైల్ విభాగం.. పనితీరును ప్రతిబింబించేలా నిఫ్టీ ఆటో ఇండెక్స్ రూపొందించబడిందని చింతన్ హరియా చెప్పుకొచ్చారు. రీ బ్యాలెన్సింగ్ సమయంలో ఏ ఒక్క స్టాక్ 33 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని, టాప్-3 స్టాక్‌ల వెయిటేజీ 62 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. ఇండెక్స్ ప్రతీ సంవత్సరం మార్చి, సెప్టెంబర్‌లో సెమీ రీ బ్యాలెన్స్ చేయబడుతుందని చెప్పుకొచ్చారు. నిఫ్టీలో ఆటో టీఆర్‌ఐ మునుపటి 11 ఏళ్లలో 7 సంవత్సరాలు.. నిఫ్టీ 50 టీఆర్‌ఐని అధిగమించింది. 2021, డిసెంబర్ 24 నాటి డేటా ప్రకారం.. ఎంఎఫ్‌ఐ ఎక్స్‌ప్లోరర్ అనేది.. ఇక్రా ఆన్‌లైన్ లిమిటెడ్ అందించిన సాధనం. గత పర్‌ఫార్మెన్స్ భవిష్యత్తులో కొనసాగొచ్చు.. లేదా ఉండకపోవచ్చు. ఇండెక్స్ మొత్తం రిటర్న్ వేరియంట్ ఉపయోగించబడింది.
ఈటీఎఫ్ పనితీరే పరిగణలోకి..
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ నిఫ్టీ ఆటో ఈటీఎఫ్‌ను ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని చింతన్ హరియా వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయడంపై దృష్టి సారించిన అనేక లార్జ్ క్యాప్ కంపెనీలకు ఎక్స్‌పోజర్‌ను అందిస్తుంది. అవకాశాలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ పెరిగినప్పుడు.. ఈటీఎఫ్ పనితీరును లక్ష్యంగా చేసుకుంటుంది. వ్యక్తిగత ఆదాయం పెరగడం ద్వారా మహమ్మారి కారణంగా.. ఆటో పరిశ్రమ సానుకూల విక్రయాలను చూసే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన కార్మికులు.. దృఢమైన ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, తక్కువ ధర ఉక్కు ఉత్పత్తి పెట్టుబడికి గొప్ప అవకాశాలను కూడా అందిస్తుంది. బెంచ్ మార్క్ సూచీల్లో భాగమైన బ్లూ చిప్ ఆటో, ఆటో అనుబంధ షేర్లు ఎక్స్‌పోసర్ చేయడం ఈ ఆఫర్ లక్ష్యం. బలమైన పునరుద్ధరణ, ఆర్థిక వ్యవస్థను తెరవడం వంటి వాటి నేపథ్యంలో ఆటోలకు డిమాండ్ ఊపందుకుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital