నెల్లూరు జిల్లాలో ఏటీఎంలో డబ్బులు నింపే వ్యాన్ డ్రైవర్ 50 లక్షలతో పరారైయ్యాడు. ఏటీఎంలలో నగదు నింపే సెక్యూర్ వ్యాలీ క్యాష్ ఏజెన్సీలో పోలయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 50 లక్షల నగదు తీసుకుని ఏటీఎంలలో నింపేందుకు ఏజెన్సీ సిబ్బంది బయలుదేరారు. ఓ ఏటీఎం వద్ద సిబ్బంది కిందికి దిగిన వెంటనే ఇదే అదునుగా భావించిన వ్యాన్ డ్రైవర్ పోలయ్య.. నగదు ఉన్న పెట్టతో వ్యాన్‌తో సహా ఉడాయించాడు. సిబ్బంది అప్రమత్తమయ్యేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పోలయ్య కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి : భారత విమానాలపై నిషేధం పొడిగించిన యుఎఇ..