ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను పెంచింది. రూ.2కోట్ల కంటే ఎక్కువ ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను మార్చినట్లు తెలిపింది. 3సంవత్సరాల నుంచి 10సంవత్సరాల కాలవ్యవధిలో రూ.2కోట్ల కంటే ఎక్కువ అదేవిధంగా రూ.5కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అత్యధిక ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేటు 4.6శాతం పెంచింది. 2సంవత్సరాలకంటే ఎక్కువ 3సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలకు 4.50శాతం వడ్డీ లభిస్తుంది.
కొత్తరేట్లు మార్చి 10నుంచి అమలుచేస్తున్నట్లు ఐసీఐసీఐ తెలిపింది. 15 నుంచి 18నెలల ఎఫ్‌డీకి 4.2శాతం వడ్డీ అందజేయనున్నారు. 2సంవత్సరాల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.3శాతం వడ్డీ లభిస్తుంది. అయితే రూ.2కోట్లలోపు డిపాజిట్ల రేట్లలో ఎలాంటి మార్పులేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..