Saturday, November 23, 2024

Iceland | 700 భూకంపాలతో వణికిన ఐస్‌లాండ్‌

ఐరోపాలో అత్యధిక సంఖ్యలో చురుకైన అగ్నిపర్వత వ్యవస్థలకు నిలయమైన ఐస్‌లాండ్‌లో ఆదివారం 700 భూకంపాలు సంభవించాయి. గ్రిందావిక్‌ పట్టణానికి సమీపంలో బలమైన భూకంపం సంభవించినట్లు ఇండిపెండెంట్‌ ఒక నివేదికలో తెలిపింది. అక్టోబరు చివరలో రాజధాని రేక్‌జావిక్‌కు సమీపంలో ఉన్న ప్రాంతంలో భూకంప కార్యకలాపాలు, భూగర్భ లావా ప్రవాహాలు పెరిగినప్పటి నుండి ఐస్‌లాండ్‌ విస్ఫోటన ప్రమాదంతో జీవిస్తోంది.

దాని వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిన నవీకరణలో, ఐస్‌లాండిక్‌ మెట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆదివారం దాదాపు 300 భూకంపాలు ఎదుర్కొందని, పట్టణానికి సమీపంలో అర్ధరాత్రి ముందు గంటకు పైగా ప్రకంపనలు కొనసాగినట్లు పేర్కొంది. గత 48 గంటల్లో, బలమైన భూకంపం 2.7 తీవ్రతతో నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

నగరం అంతటా పెద్ద అగాధాలు కనిపించడంతో భూకంప కార్యకలాపాలు అగ్నిపర్వత విస్ఫోటన సంభావ్యతను పెంచడంతో నివాసితులు నగరాన్ని విడిచివెళ్లాలని గతనెలలోనే హెచ్చరికలు జారీచేశారు. ”ఇది ఇప్పటికీ ఇక్కడ ప్రమాదకరం… నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. సాధారణంగా బయటికి వెళ్లడానికి కొన్ని నిమిషాల హెచ్చరిక ఉంటుంది. కానీ ఈ రోజు అంత సమయం కూడా లేదు” అని పౌర రక్షణ అధికారి ఒకరు చెప్పారు. నేను ఈ పీడకల నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని గ్రిండావిక్‌ నివాసి ఆండ్రియా మీడియాతో చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement