తూర్పు సిక్కింలో మంచు తుపాన్ తో ఆక్కడి ప్రజల జీవనం అతలాకుతలమైంది.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న హిమపాతం వల్ల అనేక మంది ఎతైన కొండ ప్రాంతాలలో చిక్కుకుపోయారు.ఇప్పటికే రంగంలోకి దిగిన సైన్యం చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను రక్షించారు.
భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని, చిక్కుకుపోయిన పర్యాటకులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని వారు చెప్పారు. పర్యాటకులందరికీ ఆశ్రయం, వెచ్చని దుస్తులు, వైద్య సహాయం, వేడి ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. చిక్కుకుపోయిన పర్యాటకులకు వసతి కల్పించేందుకు సైనికులు తమ బ్యారక్‌లను ఖాళీ చేశారని ఆయన చెప్పారు.. మిగిలిన ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు.