Wednesday, November 20, 2024

ICC | పాకిస్తాన్‌కు షాకిచ్చ‌కిన‌ ఐసీసీ..

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా నిన్న శనివారం బెంగళూరు వేదికగగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యచ్ లో.. డీఎల్ఎస్ పద్దతిలో గెలుపొందింది పాకిస్తాన్. సెమీస్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఇక, ఈ గెలుపు ఇచ్చిన జోష్ లో ఉన్న పాకిస్థాన్ జట్టుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది.

స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టు తమ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశిత స‌మ‌యంలో రెండు ఓవ‌ర్ల‌ను త‌క్కువ‌గా వేసింది. దీంతో రెండు ఓవ‌ర్ల‌కు 10 శాతం జ‌రిమానాగా మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ విధించారు. త‌మ త‌ప్పిదాన్ని పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం అంగీక‌రించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement