దక్షిణాఫ్రికా వేదికగా 2023 జనవరి 14 నుంచి 29 వరకు తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ జరుగనుంది. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఐసీసీ మెగా టోర్నీ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 2021లోనే ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ భావించినా, కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యంగా ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. నాలుగేసి జట్లును ఒక్కో గ్రూప్‌గా విభజించారు. గ్రూప్-డిలో టీమిండియా, సౌతాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు జట్లు… సూపర్ -6 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత సూపర్-6లో రెండు గ్రూపుల్లో టేబుల్ టాప్‌లో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి. జనవరి 27న పొట్చెఫ్‌స్ట్రూమ్‌లోని జేబీ మార్క్స్ ఓవల్ మైదానంలో సెమీఫైనల్స్ జరుగనుండగా, 29న ఫైనల్ మ్యాచ్ అదే మైదానంలో నిర్వహించనున్నారు.దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న
అండర్-19 ఉమెన్స్ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షఫాలీ వర్మ మొట్టమొదటి అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. కాగా షఫాలీ వర్మ ప్రస్తుతం సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ… ఇంకా 19ఏళ్లు పూర్తి కాకపోవడంతో అండర్-19 జట్టుకు ఎంపికైంది. ఇప్పటిదాకా షఫాలీ వర్మ 2 టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20 మ్యాచ్‌లు ఆడిన షఫాలీ వర్మ మూడు ఫార్మాట్లలో కలిపి 11 హాఫ్ సెంచరీలతో 1800లకు పైగా పరుగులు చేసింది. వీరూలాగా దూకుడుగా బ్యాటింగ్ చేసే షెఫాలీతోపాటు భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఈ జట్టులో భాగమైంది. తెలంగాణకు చెందిన అమ్మాయి గొంగడి త్రిషా, అండర్-19 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకుంది. ఇక షఫాలీ డిప్యూటీగా శ్వేతా షెరావత్ వ్యవహరించనుంది. శ్వేతా షెరావత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవల ముగిసిన అండర్-19 చాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా షెరావత్ నిలిచింది.
భారత జట్టు: షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), గొంగిడి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహ్దియా, హర్లీ గాలా, హృషితా బసు(వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనాదేవి, పార్హవి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ మహ్మద్
స్టాండ్‌బై ప్లేయర్లు: శికా సహ్లాట్, నిజ్లా సీఎంసీ, యశశ్రీ.
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్
ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత జట్టు ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌లు ప్రిటోరియాలోని టక్స్‌ఓవల్‌లో జరుగనున్నాయి. డిసెంబర్ 27న తొలి టీ20 మ్యాచ్, 29న రెండో టీ20, 31న మూడో టీ20, జనవరి 2న నాల్గో టీ20, జనవరి 4న ఆఖరి టీ20 మ్యాచ్ టీమిండియా ఆడనుంది.
భారత జట్టు: షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్, గొంగడి త్రిషా, సౌత్య తివారి, సోనియా మెహ్దియా, హర్లీ గలా, హర్షితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, పర్శవీ చోప్రా, తిటస్ సదూ, ఫలక్‌నాజ్, షబ్నం మహ్మద్
స్టాండ్‌బై ప్లేయర్లు: శికా సహ్లాట్, నిజ్లా సీఎంసీ, యశశ్రీ.