Thursday, November 21, 2024

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్..పడిపోయిన కోహ్లీ ర్యాంక్..

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్ల తన వ్యక్తిగత ర్యాకింగ్స్ లో దిగజారాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి 791 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అదే టెస్టులో సెంచరీ సాధించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 846 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు రూట్ ఐదవ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 901 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ (891), మార్న్ లాబుస్చాగ్నే (878) పాయింట్లతో వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రి షబ్ పంత్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 లో కొనసాగుతున్నారు.రోహిత్ శర్మ 764 పాయింట్లతో, రిషబ్ పంత్ 746 టాప్ 10 లో ఉన్నారు. రవీంద్ర జడేజా 3 స్థానాలు ఎగబాకి 36 వ స్థానానికి చేరుకున్నాడు. లోకేశ్ రాహుల్ ర్యాంకింగ్స్‌లో తిరిగి వచ్చి.. 56 వ స్థానంలో ఉన్నాడు. మొదటి టెస్టులో రాహుల్ 84, 26 పరుగులు చేశాడు.

ఇక బౌలింగ్‌ విభాగంలో ఇద్దరు భారతీయ బౌలర్లకు టాప్‌-10 చోటుదక్కగా.. జస్‌ప్రీత్ బుమ్రా తన ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. అతను 10 స్థానాలు ఎగబాకి 9 వ స్థానానికి చేరుకున్నాడు. మరో భారత బౌలర్‌ రవిచంద్ర అశ్విన్‌ తన రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా టాప్-10 టెస్టు బౌలర్ల జాబితాలోకి తిరిగొచ్చాడు. బుమ్రా తొలి టెస్టులో 110 పరుగులిచ్చి 9 వికెట్లు తీశాడు. 2019 సెప్టెంబర్‌లో బుమ్రా తన కెరీర్‌లో అత్యుత్త మూడవ స్థానాన్ని పొందాడు. బుమ్రా ఇప్పుడు 760 పాయింట్లతో 9 వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ 908 పాయింట్లతో ప్రపంచ నంబర్‌ 1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 856 పాయింట్లతో రెండో స్థానంలో.. న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం..మీరు జైలుకు వెళ్లడం తథ్యం: దాసోజు శ్రవణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement