Saturday, November 23, 2024

ఫైనల్ మ్యాచ్ వేదికపై మాజీల విమర్శలు..నెటిజన్ల మీమ్స్ సెటైర్లు..

ఇప్పటికే రెండున్నర రోజులు వాతావరణం కారణంగా రద్దు కావడంతో సోషల్ మీడియాలో ఫైనల్ మ్యాచ్ సౌంతిప్టన్‌లో నిర్వహించాలని భావించిన ఐసీసీని ట్రోల్ చేస్తూ మీమ్స్ ప్రత్యేక్షమయ్యాయి…ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీమ్స్.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం, వాతావరణం కలిగిస్తూనే ఉండడంతో ఫలితం తేలడం కష్టంగానే కనిపిస్తోంది. వర్షం కారణంగా రెండు రోజులు, బ్యాడ్ లైట్ కారణంగా ఓ షెడ్యూల్ తుడిచిపెట్టుకోవడంతో రిజర్వు డేతో కలిసి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి..

ఫైనల్ మ్యాచ్‌కి వరుసగా వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురి అవుతున్నారు. ఇంగ్లాండ్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ నిర్వహించాలని షెడ్యూల్ చేసిన ఐసీసీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

గత వారం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ బాగానే జరిగిందిగా, ఎందుకిలా మాట్లాడుతున్నావని ఓ ఇంగ్లాండ్ ఫ్యాన్ కామెంట్ చేశాడు. దానికి సమాధానమిచ్చిన పీటర్సన్… ‘ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన మ్యాచ్…

కానీ వర్షం, వాతావరణం వల్ల అది సజావుగా సాగడం లేదు. వాతావరణాన్ని మనం అంచనా వేయలేం. కానీ ఇలాంటి ముఖ్యమైన మ్యాచులకు మంచి వాతావరణం ఉన్న ప్లేస్ అవసరం…’ అంటూ రిప్లై ఇచ్చాడు.

- Advertisement -

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లాంటి ముఖ్యమైన మ్యాచులకు యూఏఈ, దుబాయ్ వేదికలు కరెక్టుగా సరిపోతాయి. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడమే కాకుండా సదుపాయాలు కూడా బాగుంటాయి…’ అంటూ కామెంట్ చేశాడు కేవిన్ పీటర్సన్.

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ లాంటి టోర్నీలకు ఒక్క రిజర్వు డే మాత్రమే కేటాయించడం సరికాదని, మ్యాచ్ ఫలితం తేలేవరకూ మూడు రోజులు రిజర్వు చేసి ఉంటే బాగుండేదని కామెంట్ చేశాడు…

Advertisement

తాజా వార్తలు

Advertisement