Saturday, September 28, 2024

ICC ODI rankings | టాప్ 3 లో స్మృతి మందాన…

ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన దూసుకువెలుతోంది. తాజాగా ఐసీసీ విడుద‌ల చేసిన మ‌హిళ‌ల వ‌న్డే ర్యాంక్సింగ్స్‌లో ఆమె రెండు స్థానాలు ఎగ‌బాకి మూడో స్థానానికి చేరుకుంది. ప్ర‌స్తుతం మందాన ఖాతాలో 715 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ న‌టాలీ స్కివ‌ర్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలో ఉంది. శ్రీలంక కెప్టెన్ చ‌మారీ ఆట‌ప‌ట్టు రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

- Advertisement -

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకోగా, మరోవైపు ఆల్ రౌండర్లలోనూ 6వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement