Tuesday, November 26, 2024

ఢిల్లి, నాగ్‌పూర్‌ పిచ్‌లకు రేటింగ్‌ ఇచ్చిన ఐసీసీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో నాగ్‌పూర్‌, ఢిల్లి నగరాల్లో తొలి రెండు టెస్టులు జరిగిన విషయం తెలిసిందే. ఆ రెండు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిశాయి. విదర్బ, జైట్లీ స్టేడియాల్లో జరిగిన ఆ మ్యాచ్‌ల్లో స్పిన్‌ బౌలర్లు తమ తడాఖా చూపించారు. టెస్ట్‌ సిరీస్‌ రసవత్తరంగా సాగుతుందని భావించిన తరుణంలో తొలి రెండు టెస్టులు దాదాపు ఏకపక్షంగా ముగిసాయి. అయితే ఆ పిచ్‌ల గురించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఓ రిపోర్టును తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండు పిచ్‌లకు యావరేజ్‌ రేటింగ్‌ కూడా ఇచ్చినట్లు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ కథనం ద్వారా స్పష్టమవుతోంది.

ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ అండీ పై క్రాప్ట్‌ ఈ రిపోర్టును ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగ్‌పూర్‌లోని విదర్బ క్రికెట్‌ సంఘం స్టేడియం పిచ్‌ యావరేజ్‌గా ఉన్నట్లు అండీ పై క్రాప్ట్‌ తెలిపారు. తొలి టెస్ట్‌లో ఇండియా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లిలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మూడవ రోజే ముగిసింది. ఆ పిచ్‌కు కూడా యావరేజ్‌ రేటింగ్‌ ఇచ్చాడు పై క్రాప్ట్‌. ఇప్పటికే సిరీస్‌లో 2-0 తేడాతో ఇండియా ఆధిపత్యాన్ని చాటింది. ఇక మూడో టెస్ట్‌ ఇండోర్‌లో మార్చి 1న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement