భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్లకు ఐసీసీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ రెండు జట్లకు భారీ జరిమానా విధించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన నాటింగ్ హామ్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో రెండు పాయింట్ల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ వివరించింది.
మరోసారి స్లో ఓవర్ రేట్ తిరిగి పునరావృతం కాకుదని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. కాగా తొలి టెస్టులో చివరి రోజు వర్షం కురవడంతో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ కొత్త పాయింట్ల వ్యవస్థ ప్రకారం.. ఒక టెస్ట్ డ్రా అయితే రెండు టీమ్స్‌కు నాలుగేసి పాయింట్ల కేటాయిస్తారు. కానీ ఐసీసీ జరిమానా విధించడంతో ఇండియా, ఇంగ్లండ్ ఖాతాలో ప్రస్తుతం రెండేసి పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ఈ నెల 12న ప్రారంభం కానుంది.
ఈ వార్త కూడా చదవండి: ఇటు టీమిండియా.. అటు ఇంగ్లండ్ జట్లకు గాయాల బెడద