అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 మధ్య జరిగే అతిపెద్ద క్రికెట్ ప్రపంచ కప్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను భారతదేశానికి రానున్నారు. కాగా, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 టిక్కెట్లు ఇవ్వాల (శుక్రవారం) రాత్రి 8 గంటలకు సాధారణ విక్రయానికి రానున్నాయి. ఈ టిక్కెట్‌లు ప్రపంచ కప్ అధికారిక https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
టిక్కెట్ల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని.. ప్రపంచ కప్ చూసేందుకు వచ్చే అభిమానులకు ఉత్తమ అవకాశాన్ని అందించడానికి… దశలవారీగా టికెట్లను సేల్ లో పెట్టనున్నారు. అందులో భాగంగా.. నేటి నుండి నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌ల టిక్కెట్లు విక్రయానికి రానున్నాయి.
తదుపరి లీగ్ మ్యాచ్‌ల టిక్కెట్ విక్రయాలు క్రింది దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి..
అహ్మదాబాద్, బెంగళూరు, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, లక్నో, కోల్‌కతా, ముంబై, పూణే: పది ఆతిథ్య నగరాల్లోని 10 వేదికల్లో జరిగే 44 మ్యాచ్‌ల కోసం జనరల్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభమవుతాయి. అదనంగా, గౌహతి, తిరువనంతపురంలో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి.