Friday, November 22, 2024

సీఏ ఫౌండేషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సీఏ ఫౌండేషన్ పరీక్షలను వాయిదా వేసింది. దీంతో పాటు జూలైలో జరుప‌త‌ల‌పెట్టిన‌ ఇంటర్మీడియట్, సీఏ ఫైనల్ పరీక్షల తేదీల‌ను కూడా విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం, సీఏ ఫౌండేషన్ పరీక్ష ఇప్పుడు జూలై 24 నుంచి ప్రారంభమవుతుంది. సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను (పాత, కొత్త కోర్సులకు) జూలై 6 నుంచి 20 వరకు జరుప‌నున్నారు. పాత, కొత్త కోర్సులకు తుది పరీక్షలు జూలై 5 నుంచి 19 వరకు నిర్వ‌హించ‌నున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org ద్వారా షెడ్యూల్‌ను చూడ‌వచ్చు.

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఐసీఏఐ సీఏ ఫౌండేషన్ పరీక్షను వాయిదా వేసింది. అంతకుముందు ఈ పరీక్ష జూన్ 24, 26, 28, 30 తేదీలలో నిర్వహించవలసి ఉన్న‌ది. ఇప్పుడు ఈ పరీక్ష జూలై 24 నుంచి జరుగుతుంది. 1 నుంచి 5 వరకు మాడ్యూళ్ళకు బీమా రిస్క్ మేనేజ్మెంట్ (ఐఆర్ఎం) సాంకేతిక పరీక్ష జూలై 5, 7, 9, 11 తేదీల్లో జరుగ‌నుంది. కాగా పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. పేపర్ -1, పేపర్ -2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, పేపర్ 3, 4 మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రం కోసం నగరాన్ని మార్చుకునేందుకు జూన్ 9 నుంచి జూన్ 11 వరకు విండోను తిరిగి తెరవనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. అభ్యర్థులు icaiexam.icai.org ద్వారా ప‌రీక్ష సెంట‌ర్ న‌గ‌రంలో మార్పులు చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement